- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేవరకొండలో ఉరి వేసుకుని వివాహిత మృతి
దిశ, దేవరకొండ: క్షణికావేశానికి లోనై ఉరి వేసుకొని ఓ వివాహిత మృతి చెందిన ఘటన దేవరకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ బంజార భవన్ వద్ద చోటుచేసుకుంది. ఎస్సై సతీశ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ పట్టణంలో డిండి మండలం ప్రతాప్ నగర్ కు చెందిన జర్పుల లక్ష్మీపతి, సరిత అనే భార్య భర్తలు పిల్లలతో కలిసి బంజారా భవన్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. లక్ష్మీపతి ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా సరిత తన ఇద్దరి పిల్లలను చూసుకుంటూ ఇంటి వద్దనే ఉంటున్నది. అయితే కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో క్షణికావేశానికి గురైన సరిత భర్త ఇంట్లో ఉండగానే బెడ్ రూంలోకి వెళ్లి ఘడియ పెట్టుకొని ఫ్యాన్ ఉరి వేసుకుంది. ఎంత సేపటికి బయటకి రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త.. తలుపు తట్టడంతో లోపలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.
వెంటనే కిటికీ దగ్గరికి వెళ్లి చూడగా సరిత ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించింది. దీంతో సాయం కోసం కేకలు వేసిన భర్త.. చుట్టుపక్కల వాళ్ల సాయంతో రూం తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. అయితే వెళ్లేసరికి సరిత చనిపోయినట్లు భర్త, స్థానికులు చెబుతున్నారు. బెదిరించడానికి లోపల ఘడియ పెట్టుకుందని అనుకున్నానని, ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని బాధితుడు వాపోయాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీశ్, బాలకృష్ణ తెలిపారు.