- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆశలు ఆవిరి
దిశ,తుంగతుర్తి : ఎన్నెన్నో ఆశలు...! ఆపై కలలు..!! కాలం కలిసి రాకపోతుందా...? మన భవిష్యత్తు మారక పోతుందా..? అంటూ వ్యవసాయ సాగుపై ముందడుగు వేసిన రైతాంగానికి చివరికి నిరాశే ఎదురవుతుంది. సాగు చేసిన పంటలు కళ్లముందే ఎండుతుంటే గుండె తరుక్కుపోయి గోడుమంటున్నారు. వస్తాయనుకున్న శ్రీరామ్ సాగర్ రెండో దశ (ఎస్సారెస్పీ) కాలువ నీళ్లు రాకపోగా వర్షాలు సైతం ముఖం చాటేసిన పరిస్థితులు తుంగతుర్తి నియోజకవర్గంలో నెలకొనడంతో రైతాంగం పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పుడిప్పుడే నెర్రలు భారీ ఎండుతున్న పంటలకు మరో వారంలోగా వర్షాలు కురవడమో లేక ఎస్సారెస్పీ నీళ్లు రావడం లాంటివి జరిగితే తప్ప పంటలు పండే పరిస్థితి లేదని, లేకుంటే వందలాది ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతాంగం ఆందోళన చెందుతోంది.
నియోజకవర్గంలోని నూతనకల్,మద్దిరాల, తుంగతుర్తి, నాగారం, అర్వపల్లి, తిరుమలగిరి మండలాల వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజర్ లో కురిసిన తొలకరి వర్షాలకు తోడు శ్రీరాంసాగర్ రెండవ దశ జలాలు వస్తాయనే ఆశతో రైతాంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వరితో పాటు పత్తి, మిరప పంటల సాగుపై దృష్టి సారించింది. ఈ మేరకు 90 వేల ఎకరాలకు పైగా వరి పంట సాగులోకి వచ్చింది. ఇక మిగతా పంటల సాగు లెక్క వేరే. అయితే కురిసిన కొద్దిపాటి వర్షాలకు చెరువులు, కుంటల్లో కొంతవరకు నీళ్లు చేరినప్పటికీ కాలానుగుణంగా ఆ వర్షాలు ముఖం చాటేశాయి.
దీంతో రైతాంగం ఎస్సారెస్పీ రెండవ దశ కాలువ నీటిపై ఆశలు పెంచుకుంది. వచ్చే నీళ్లతోనైనా పంటలు పండుతాయని భావించింది. దీనికి తోడు ప్రతి ఏడాది మాదిరిగానే ఆగస్టు మాసంలో రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించి నీటి విడుదల చేస్తుందని రైతాంగం గట్టిగా నమ్మింది. కానీ ఉత్తర తెలంగాణలో ఏర్పడ్డ పరిస్థితుల వల్ల శ్రీరామ్ సాగర్ రెండవ దశ జలాల విడుదల పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఉన్న ఆశ కూడా కనుమరుగవడంతో రైతాంగం బిక్క చచ్చిపోయింది. వ్యవసాయ బావుల్లో గణనీయంగా నీటిమట్టం తగ్గిపోతుండగా బోర్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బోర్ల ద్వారా వచ్చిరాని నీటితో వరి పొలాల పరిస్థితి మెరుగుపడకపోగా ఎండిపోయే దశకు చేరుతున్నాయి.
గ్రామాల్లో ఎండుతున్న పంటలు
తుంగతుర్తి మండలంలోని బాపనిబావి తండా, భారతి తండా, రావులపల్లి క్రాస్ రోడ్డు, సూర్య నాయక్ తండాలలో అన్నారం, గొట్టిపర్తి, వెలుగుపల్లి, సంగేమ్, రావులపల్లి, మానాపురం తదితర ప్రాంతాలతో పాటు పలు మండలాల పరిధిలోని గ్రామాల్లో వరి పంటలు బీటలు బారుతూ ఎండిపోయే దశకు చేరుకుంటున్నాయి.
లబోదిబో మంటున్న రైతులు
బాపనిబావి తండాకు చెందిన భూక్య శ్రీనుకు చెందిన ఎకరం 20 గుంటల భూమి నీళ్లు లేక ఎండిపోతోంది. ఉన్న బోరు సన్నటి నీటి ధారతో వస్తూ అడుగంటుతోంది. అలాగే భూక్య భిక్షం 4 ఎకరాలలో వరి సాగు చేస్తే అందులో రెండు ఎకరాలు నీళ్లు లేక ఎండిపోతోంది. భూక్య చంద్రుకు చెందిన మూడు ఎకరాలు, భూక్య సర్వన్, దారావత్ నరసింహ, ధారావత్ శ్రీరాములు తదితర రైతాంగం ఎస్సారెస్పీ రెండో దశ కాలువ నీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తే చివరికి ఎండిపోతున్నాయి.
తెచ్చిన అప్పులు తీర్చలేని పరిస్థితి
వరి పంటల సాగు కోసం రైతాంగం తెచ్చిన అప్పులు తీర్చలేని పరిస్థితులు నెలకొన్నాయి. దుక్కులు దున్ని నారు మళ్లు అలకడం మొదలు నాట్లు వేయడం, వివిధ రకాల యూరియా తదితర వాటికి ఇప్పటికే రైతులు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. అయినప్పటికీ నెలకొన్న పరిస్థితులతో ఎండు దశకు చేరుతున్నాయి.