- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Khammam : ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం పై విజిలెన్స్ నిఘా
దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఉద్యోగులు గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మరలా చేయకుండా విజిలెన్స్ వారిపై నిఘా పెట్టింది. కొన్ని నెలల క్రితం జరిగిన బదిలీల్లో కొంతమందినిఇక్కడ నుండి వేరే మున్సిపాలిటీ లకు పంపడం మరికొంతమంది ని వివిధ సెక్షన్ల నుండి మార్చి వేరే సెక్షన్లను అప్పజెప్పిన ఇంకా కార్యాలయంలో తప్పులు దొర్లడం జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాక గత ప్రభుత్వంలో అభివృద్ధి పేరుతో పనుల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వస్తున్న ఆరోపణలపై కూడా విజిలెన్స్ (Vigilance) పూర్తిస్థాయి ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి ఒకరిద్దరు కాంట్రాక్టర్లకు షోకాజ్ నోటీసులు (Show cause notices) ఇచ్చినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
వారికి సహకరించిన అధికారులపై కూడా విచారణ జరిగే అవకాశం లేకపోలేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో జిల్లా కలెక్టర్ కూడా మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగ విషయంలో ఎవరు అశ్రద్ధ వహించిన, తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం కూడా జరిగింది. అయినా కొంతమంది అధికారులు ఇంకా మారకపోవడం పట్ల పలు అనుమానాలకు దారితీస్తుంది. (Engineering) ఇంజనీరింగ్ విభాగంలో గతంలో పనిచేసిన కొంతమంది అధికారులు గుత్తేదారులతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్లనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల్లో అవినీతి బట్టబయలైందని వాదనలు లేకపోలేదు. ఇక కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా వీరితో జత కలిసి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తుంది. రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు గతంలో జరిగిన తప్పులను సరి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న కొంతమంది చేసిన తప్పులకు వీరు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో ఇంటి నిర్మాణాలు లేకుండానే ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు ఇచ్చి రిజిస్ట్రేషన్లు అయ్యే విధంగా చేసిన ఉద్యోగులు ప్రస్తుతం ఇక్కడ నుండి బదిలీ అయ్యాయి ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ఆ విధంగా చేసిన వారు ఎవరైనా వారిపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆరా తీయాలని ప్రజలు కోరుకుంటున్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో కూడా కొంతమంది సిబ్బంది తప్పులు చేయడం వల్ల అక్రమ కట్టడాలకు నిలయంగా ఖమ్మం మారడం జరిగిందని విమర్శలు లేకపోలేదు. అసిస్టెంట్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న నూతన అధికారిపై కూడా ప్రస్తుతం విమర్శలు గుప్పుమంటున్నాయి.
ఇప్పటికే అసిస్టెంట్ కమిషనర్ ను జీహెచ్ఎంసీకీ బదిలీ చేసినప్పటికీ కమిషనర్ తనకు కొత్త అసిస్టెంట్ కమిషనర్ ను నియమించే వరకు ఇక్కడి నుండి పంపే అవకాశం లేదని చెప్పడంతో ఆ అసిస్టెంట్ కమిషనర్ కొంతమంది ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. కావాలనే గతంలో ఇక్కడ పనిచేసిన ఓ ఉద్యోగిని తన అసిస్టెంట్గా పెట్టుకుని ప్రతి సెక్షన్ పై పెత్తనం కోసం ఐదు పది నిమిషాలు లేటుగా వచ్చిన వారికి ఒకరోజు జీతాలు నిలిపివేసినట్లు ఉద్యోగులు తమలో తాము ఆవేదన చెందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశుధ్యం పై శ్రద్ధ వహించాల్సిన అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం విధుల్లో జోక్యం చేసుకుని మిగిలిన ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నట్లు విమర్శలు లేకపోలేదు.