- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పంచాయతీలను గ్రేడ్‌లుగా విభజించండి: సీఎస్‌కు టీపీఎస్ఏ వినతి
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులను తెలంగాణ పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్ (టీపీఎస్ఏ) వినతి పత్రం సమర్పించింది. పంచాయతీలను గ్రేడ్‌లుగా విభజించాలని, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్న కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా మార్చాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ లను కలిసిన టీపీఎస్ఏ అధ్యక్షుడు పి.మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీనివాస్‌లు వినతి పత్రం ఇచ్చారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్ కాలాన్ని రెండు సంవత్సరాలకు తగ్గించాలని, పంచాయతీరాజ్ చట్టంలోని లోపాలను సవరించాలని, 317 జీవోతో నష్టపోయిన కార్యదర్శులను సొంత జిల్లాలకు పంపించాలని వారు కోరారు. కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలని, అర్హత ఉన్న బిల్ కలెక్టర్‌లకు పదోన్నతి కల్పించాలని, పారిశుధ్య సిబ్బందికి పే స్కేల్ వర్తింప చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. తమ అసోసియేషన్‌కు హైదరాబాద్‌లో వసతి సౌకర్యం కల్పించాలని కోరారు. అధికారులను కలిసి వారిలో టీపీఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.సతీష్ కుమార్, సుదర్శన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.అరుణ్, జాయింట్ సెక్రటరీ వి.కవిత, లక్ష్మి నారాయణ లు వినతి పత్రం ఇచ్చారు