- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nagarjunasagar : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద
దిశ, నాగార్జున సాగర్ : నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలాశయం 26 క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఎగువన శ్రీశైలం జలాశయం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సాగర్ ప్రాజెక్టు మొత్తం 26 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ సోయగాలు వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో నాగార్జున సాగర్ కళకళ సంతరించుకుంది. ఇప్పటికే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది.
మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2 లక్షల, 73వేల, 370 క్యూసెక్కులుగా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 585.90 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ సామర్థ్యం 300 టీఎంసీలకు చేరుకుంది. జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 28,420 క్యూసెక్కుల నీటిని,
కుడి కాలువ ద్వారా 8144 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాల్వ ద్వారా 8193 క్యూసెక్కుల నీటిని, ఎస్.ఎల్.బీ.సీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లోలెవల్ కెనాల్ ద్వారా నీటి విడుదల లేదు. రిజర్వాయర్ నుండి మొత్తం 2,72,019 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పులిచింతల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2,45, 682 క్యూసెక్కులు. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించిన 11 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
పర్యటకుల సందడి
సహజ సుందర జలదృశ్యాన్ని చూడడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు. రోడ్లపై ఎక్కడ చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగడంతో ఆ జలదృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దాంతో డ్యాం పరిసరాలు పర్యాటకులతో సందడిగా మారాయి. తమ సెల్ ఫోన్లలో
బంధించుకుంటున్నారు. సాగర్‌లో ఉన్న పర్యాటక ప్రాంతాలైన అనుపు, బుద్ధ వనం, కొత్త వంతెన, పాత వంతెన తదితర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. హిల్‌కాలనీ విజయవిహార్ అతిథి గృహం వెనక ఉన్న నూతన లాంచీ స్టేషన్ నుంచి జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు నాలుగు లాంచీ ట్రిప్పులను పర్యాటక శాఖ నడుపుతోంది. పర్యాటకుల సందడితో నాగార్జునసాగర్ ప్రాంతం సందడిగా ఉంది. అందుకు తగ్గట్లుగా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
- Tags
- Nagarjunasagar