- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేవంత్ రెడ్డి పై ఫైర్ అయిన గుత్తా సుఖేందర్ రెడ్డి
దిశ, నల్లగొండ: తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. ఈ రోజు ఉదయం ఆయన నివాసంలో మిడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్త మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్నికల ప్రణాళిక పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉందని, బీపీఎల్ కుటుంబాలకు ఇన్సూరెన్స్ ఇవ్వడం, రైతు బంధు ఎకరాకు 12 వేల రూపాయలు పెంచడం అలాగే దాన్ని 16 వేల వరకు చేస్తామని చెప్పడం శుభపరిణామం అన్నారు. 10 ఏండ్లలో దేశంలో ఎ రాష్టం తెలంగాణ రాష్ట్రంతో పోటీపడే పరిస్థితుల్లో లేదు అన్నారు. పథకాలు అన్ని ప్రజలకు అందేలా చేసే శక్తి ఒక కేసీఆర్‌కి మాత్రమే ఉంది అన్నారు.
అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టుల అందరికి గ్యాస్ సబ్సిడీ ఇస్తామని చెప్పడం, అలాగే ప్రతి నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం, 11 లక్షల మందికి కల్యాణలక్ష్మి ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అన్నారు. దళితులకు మూడు ఎకరాల ఇవ్వలేకపోయాం అయిన 7 వేల ఎకరాలు పంచినం అన్నారు. అలాగే దళిత బంధుతో వారి కుటుంబాలకు చేయుతనిస్తున్నాం అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు గాలి మాటలు అని అన్నారు. ఆరోగ్య శ్రీ క్రింద 15 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది అని అన్నారు.