Sub Collector : ఈ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగ అవకాశం..పదో తరగతి పాసైతే చాలు..

by Naveena |
Sub Collector : ఈ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగ అవకాశం..పదో తరగతి పాసైతే చాలు..
X

దిశ, మిర్యాలగూడ : మిర్యాలగూడ డివిజన్ పరిధిలో రేషన్ షాపు డీలర్ల( Ration dealers )పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ సోమవారం తెలిపారు. స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో 30 రేషన్ షాపులలో డీలర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. నేటి నవంబర్ 4 నుంచి ఈనెల 18 వరకు అర్హులైన అభ్యర్థులు ఆయా మండల తహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 6 నుంచి చేపట్టనున్న ఇంటింటి సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. ఆధార్ కార్డు ద్వారా ఇంటి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలని కోరారు. రేషన్ డీలర్ల నియామకంలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నియమాక ప్రక్రియ రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. మిర్యాలగూడ మండలం కిష్టాపురం, రాయిని పాలెం, జంక్ తండా, సిత్యా తండా, మిర్యాలగూడ పట్టణంలో శాంతినగర్, బాపూజీ నగర్, వేములపల్లి మండలం తిమ్మారెడ్డి గూడెం, రావులపెంట, మాడుగుల పల్లి మండలం చెరువుపల్లి- 2, గజలాపురం, కన్నెకల్, అడవిదేవులపల్లి మండలం ముల్కచర్ల, దామచర్ల మండలం కొండ్రపోల్, పర్తు నాయక్ తండ, నిడమనూరు మండలం బంకాపురం, ఎంజి క్యాంప్, మార్త వారి గూడెం, త్రిపురారం మండలం సత్యనారాయణపురం, గంటరావు క్యాంపు, బడాయి గడ్డ, త్రిపురారం-2, కంపసాగర్, అనుముల మండలం పాలెం, చింతగూడెం, పెద్దవూర మండలం పిన్నవూర, తిరుమలగిరి సాగర్ మండలం తిరుమలగిరి-2, అల్వాల, జమ్మన్నకోట గ్రామాల రేషన్ డీలర్లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. పదవ తరగతి పాసై 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగి అదే గ్రామానికి చెందిన వారై ఉండాలని సూచించారు. మిగతా వివరాల కోసం సంబంధిత తాసిల్దార్ కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా సూచించారు.

Advertisement

Next Story

Most Viewed