'ప్రభుత్వం కులాన్ని యూనిట్‌గా తీసుకోవాలి'

by Vinod kumar |
ప్రభుత్వం కులాన్ని యూనిట్‌గా తీసుకోవాలి
X

దిశ, సంస్థాన్ నారాయణపురం: రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందించడం లేదని అఖిల భారత పద్మశాలి యువజన విభాగం జాతీయ ఇన్చార్జి అవ్వారి భాస్కర్, అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం అధ్యక్షులు బొల్లా శివశంకర్ అన్నారు. ఆదివారం సంస్థాన్ నారాయణపురం చేనేత సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొల్ల శివశంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పద్మశాలి కులాన్ని యూనిట్‌గా తీసుకొని ప్రభుత్వ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అందించనున్న స్టాండ్లు, మొగ్గాల పథకానికి అప్లై చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ రద్దు చేసిన చేనేత పథకాలను, బోర్డులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అనంతరం అవ్వారి భాస్కర్ మాట్లాడుతూ.. పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గెలుపొంది ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం చిన్న కొండూరు అని ప్రస్తుతం భువనగిరి, మునుగోడు నియోజకవర్గలుగా ఏర్పడిన కూడా ఈ నియోజకవర్గాల్లో అత్యధిక జనాభా కలిగిన పద్మశాలీలకు ప్రాతినిధ్యం కేటాయించకపోవడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు.

ఈ కార్యక్రమంలో నారాయణపురం చేనేత సహకార సంఘం అధ్యక్షులు బోళ్ల విఠల్, ఉపాధ్యక్షులు సంగిశెట్టి లక్ష్మీనారాయణ, మార్కండేయ స్వామి దేవస్థానం అధ్యక్షులు సూరపల్లి కుచేల్, పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు సూరపల్లి జనార్ధన్, సహకార సంఘం కార్యవర్గ సభ్యులు వంగరి రఘు, ఏలే నరసింహ సూరపల్లి శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story