- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లో ఫుల్ జోష్.. రోజురోజు చేరికలతో మరింత బలం
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం పెరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు రోజు రోజుకు చేరుతుండడంతో పార్టీలో మరింత జోష్ పెంచుతోంది. దీనికి తోడు గతంలో ఉన్న అసమ్మతి సైతం పూర్తిగా తొలగిపోవడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి సైతం బూత్ స్థాయి నుంచి ప్రత్యేక వ్యూహరచనతో ముందుకు సాగుతున్నారు.
చేరికలతో పెరుగుతున్న బలం..
నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు మరింత ఊపందుకున్నాయి. బీఆర్ఎస్ నుంచి పలువురు కార్యకర్తలు ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరుకుంటున్నారు. ఈ చేరికల వలన తప్పకుండా ఎన్నికలలో ఓటు బ్యాంకు మరింత బలపడుతుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి సైతం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరికల పైన బలంగా దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
తొలిగిన అసమ్మతి..
గతంలో భువనగిరి కాంగ్రెస్ పార్టీలో తీవ్రస్థాయిలో అసమ్మతి నెలకొంది. అదే క్రమంలో అనిల్ కుమార్ రెడ్డికి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించడం, అనిల్ కుమార్ రెడ్డి తోపాటు అధిష్టానం సైతం అసమతి నాయకులతో సమావేశమవడం చేపట్టడంతో అసమతి సైతం పూర్తి స్థాయిలో తొలగిపోయినట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. అనిల్ కుమార్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటు సైతం తామంతా ఐక్యమత్యంగా ఉన్నామని, కాంగ్రెస్ పార్టీని భువనగిరిలో గెలిపించడమే ముఖ్యంగా పనిచేస్తున్నామనే సంకేతాలు ఇస్తున్నారు. అయితే భువనగిరి పట్టణంతో, బీబీనగర్ తో పాటు నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులు పూర్తిస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తుండడంతో పార్టీ శ్రేణులలో ఉత్సాహం మరింత పెరిగింది.
బూత్ స్థాయి నుంచి పక్కా వ్యూహ రచనతో..
కుంభం అనిల్ కుమార్ రెడ్డి బూత్ స్థాయి నుంచి పక్కా వ్యూహ రచనతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీలో మండల కేంద్రాలు గ్రామాలలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల, పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ ఓటరుకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వివరిస్తున్నారు. గ్రామస్థాయిలోని ప్రతి ఓటరును కలిసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వివరిస్తుండంతో ఖచ్చితంగా తమకు కలిసి వస్తుందనే భావనలో ఉన్నారు. దీనికి తోడు గ్రామస్థాయి కార్యకర్తలు సైతం ప్రజల్లోకి వెళ్లి విసృతంగా ప్రచారం చేపడుతున్నారు. ఇటు కుంభం అనిల్ కుమార్ రెడ్డి భార్య, కూతుర్లు, కొడుకు సైతం ప్రజల్లోకి వెళ్లి అనిల్ కుమార్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.