పాత ఇనుప దుకాణంలో అగ్ని ప్రమాదం

by Shiva |
పాత ఇనుప దుకాణంలో అగ్ని ప్రమాదం
X

దిశ, తుంగతుర్తి: పాత ఇనుప దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించి భారీగా ఆస్తి నష్టం జరిగిన ఘటన తిరుమలగిరి మునిసిపాలిటీ కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట-జనగాం ప్రధాన రహదారిపై అంబేద్కర్ నగర్ లో మహమ్మద్ బాబర్ అనే వ్యక్తి పాత ప్లాస్టిక్, ఇనుప సామాగ్రి దుకాణాన్ని నడుపుతున్నారు. అయితే, అకస్మాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదంతో దట్టమైన పొగలు కమ్ముకొని ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. పరిస్థితిని గమనించిన స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి అగ్నిమాపక ఇబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే అందులో ఉన్న లక్షల విలువ చేసే పాత ప్లాస్టిక్ సామాను, తదితర సామగ్రి బూడిదయ్యింది. ఈ ఘటనతో జనగాం- సూర్యాపేట ప్రధాన రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

Advertisement

Next Story

Most Viewed