- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భువనగిరి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : వరంగల్ ,హైదరాబాద్ జాతీయ రహదారిపై భువనగిరి బైపాస్ సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాదులోని రామంతపూర్ కు చెందిన యశ్వంత్, అర్జున్, నితిన్, శ్రీను, మనిజయంత్, సుఫ్యాన్ లు కారులో యాదగిరిగుట్టకి వెళ్లారు. అక్కడ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా..భువనగిరి బైపాస్ లో కారు అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న మహ్మద్ అబ్దుల్ సుఫ్యాన్ (25)తో పాటు యశ్వంత్(19) లు అక్కడికక్కడే మృతి చెందారు. అర్జున్, నితిన్, శ్రీను, మని జయంత్ లకు తీవ్ర గాయాలు కావడంతో.. భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. వీరంతా ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు, సాకేత్ 9వ తరగతి చదువుతున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..భువనగిరి పట్టణ పోలీసులు తెలిపారు.