బంగారు తెలంగాణలో అన్నదాతకు హరిగోస...

by Sumithra |
బంగారు తెలంగాణలో అన్నదాతకు హరిగోస...
X

దిశ, పెన్ పహాడ్ : మండల పరిధిలోని అనంతారం గ్రామంలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆదివారం రైతన్నలు నిర్వహిస్తున్న ధర్నాల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేయక... పండించిన ధాన్యానికి కనీసం మద్దతు ధర కల్పించక, అన్నధాత పడుతున్నా అరిగోస అంతా ఇంతా కాదండోయ్ అన్నారు. నెలలు గడిచిన ధ్యాన్యం కొనుగోళ్లు చెప్పట్టక.. మరో వైపు అకాల వర్షాల ముప్పునకు ధ్యాన్యం తడిసి ముద్దవుతోందన్నారు. ఎన్నిసార్లు ధాన్యం ఆరబోసి తేమలేకుండా చేసినా.. కాంటలు వేయకుండా జాప్యం చేయడంతో వర్షానికి తడిసి మళ్ళీ మొదటికె మోసం వస్తున్నదన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చెప్పటకపోవడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గోనె సంచులు కొరతకు తోడు ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు అమ్యామ్యాలకు అలవాటు పడడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి అంటూ పలికే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, లీడర్లు, నాయకులు కనీసం ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం అన్నీ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పత్రికా సమావేశాల్లో తడిసిన ధాన్యంతో పాటు తరుగు తీయకుంటా కొంటామని చెప్తూ లోపాయికారిగా అధికారులకు, మిల్లర్లకు, బీఆర్ఎస్ నాయకులకు దోచిపెట్టే రహస్య ఎజండాతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి రైతు వ్యతిరేక పాలనకు వ్యవహరిస్తూన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఇప్పటికైనా రైతన్నలపట్ల సానుకూలంగా స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కాంటాలు వేయాలని కోరారు. రైతులకు సరైన న్యాయం జరగకుంటే నియోజకవర్గ స్థాయిలో రైతులతో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బచ్చుపల్లి నాగేశ్వరావు, బెల్లంకొండ శ్రీరాములు, పిచ్చయ్య, ఎంపీటీసీ నాగరాజు, సురభి వెంకటేశ్వర్లు, మామిడి శ్రీనివాస్, మైసయ్య, అంజయ్య, మేకల రవి, శ్రీధర్ రెడ్డి, సాయి రంగారెడ్డి, సైదిరెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story