- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
క్రీడలతో యువతలో ఉత్తేజం : ఎస్పీ శరత్ చంద్ర పవార్

దిశ, హాలియా : క్రీడలతో యువతలో ఉత్తేజం కలుగుతుందని క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మిషన్ పరివర్తన్- యువత తేజం కార్యక్రమంలో భాగంగా గురువారం హాలియా లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ఏర్పాటు చేసిన క్రీడలతో గ్రామీణ యువతకు, పోలీసులకు మధ్య స్నేహ భావం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా యువత సక్రమ మార్గంలో ఉండేందుకు క్రీడలు ఉపయోగపడతాయని తెలిపారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం తోపాటు శరీర దారుఢ్యం పెరిగేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని ఆటలను స్ఫూర్తిగా తీసుకావాలన్నారు. మిషన్ పరివర్తన్- యువతేజం కార్యక్రమంలో బాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో 370 టీం లు నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరందరికి మండల ,డివిజన్ పరిధిల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన జట్లను జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు హాలియా సీఐ జనార్దన్ గౌడ్ ఎస్సైలు గోపాలరావు, ప్రసాద్ మండల విద్యాధికారి గుండా కృష్ణమూర్తి ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు