భారీ వర్షాలకు మండలం చెరువుకు గండి

by Mahesh |
భారీ వర్షాలకు మండలం చెరువుకు గండి
X

దిశ, మేళ్లచెరువు: మేళ్లచెరువు మండల కేంద్రంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో మండలం లో అధిక వర్షపాతం నమోదు అయింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని అన్ని చెరువులు కుంటలు నిండుకుండల్లా మారాయి. మేళ్లచెరువు మండల కేంద్రంలోని నాగుల చెరువు (చిన్న చెరువు)కు నీటి ఉధృతి ఎక్కువగా రావడంతో చెరువు మధ్య భాగంలో రెండు చోట్ల చెరువు గండ్లు పడ్డాయి. దీంతో చెరువు దిగువ భాగంలో నాట్లు వేసుకున్న పొలాలు పూర్తిస్థాయిలో కొట్టుకుపోవడంతో రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. మండలంలోని వెంకట్రాంపురం, వేపల మాదారం గ్రామం నుండి మేళ్లచెరువు మండల కేంద్రానికి ప్రయాణించే ప్రధాన రహదారి వర్షపు నీటికి తెగిపోవడంతో గ్రామాల నుండి మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. కాగా ఆ ప్రాంతాలను ఎమ్మార్వో జ్యోతి పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు.

Advertisement

Next Story

Most Viewed