చెత్త చెదారాలతో దర్శనమిస్తున్న డ్రైనేజీ

by Aamani |
చెత్త చెదారాలతో దర్శనమిస్తున్న డ్రైనేజీ
X

దిశ, మాడుగులపల్లి: మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయింది.డ్రైనేజ్ నిండి చెత్త చెదారంతో నిండి పోయి మరుగు నీరు నిల్వ ఉండటంతో డ్రైనేజీలోని నీరు బయటకు వెళ్లకుండా అంతరాయం కలిగి వ్యర్థ పదార్థాలు చెత్త చెదారాలతో దుర్వాసన వెదజల్లుతూ అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. దీంతో దోమలు విపరీతంగా పెరిగి, రాత్రి పగలు తేడా లేకుండా దోమలు దాడి చేస్తుండడంతో విష జ్వరాలు విజృంభించి ప్రజలు ఆసుపత్రుల పాలవడం జరుగుతుందని, గ్రామ కాలనీవాసులు వాపోతున్నారు. పక్కనే ప్రైమరీ స్కూల్ ఉండడంతో చిన్న పిల్లలకు ఎలాంటి విష జ్వరాలు విజృంభిస్తాయి అని తల్లిదండ్రులు భయపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత పంచాయతీ అధికారులు,కార్యదర్శులు నాయకులు డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story