Collector Tejas Nand Lal Pawar : స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి..

by Sumithra |
Collector Tejas Nand Lal Pawar : స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి..
X

దిశ, చివ్వేంల : స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామాలలో, పట్టణాలలో దోమల ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని రైతు వేదిక ఆవరణలో మొక్కని నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీధులు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్ల మీద గుంటలలో నీరు నిల్వ ఉండి దోమలు చేరుతాయని, వాటి ద్వారా డెంగ్యూ, మలేరియా వ్యాధులు వ్యాపిస్తాయి.

కాబట్టి రోడ్ల మీద గుంటలు రాళ్ళ మిశ్రమంతో పుడ్చాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఎక్కడైనా పరిశుభ్రంగా లేకపోయినా, గుంటలు ఉన్నా గ్రామపంచాయతీ వారికి తెలియజేస్తే వెంటనే గుంటలను పూడ్చి పరిసరాలను పరిశుభ్రంగా చేస్తారని కలెక్టర్ ప్రజలకు సూచించారు. మండలంలో రైతు భీమా, పంట నమోదు, రైతు రుణమాఫీ గురించి మండల వ్యవసాయ అధికారులతో చర్చించి ఇంకా ఎవరైనా అర్హత ఉండి రుణమాఫి కానీ రైతుల వివరాలను పై అధికారులకు, బ్యాంక్ అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.

అనంతరం ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు కలెక్టర్తో ఉపాధి హామీ కూలీ డబ్బులు జమ అవ్వటం లేదని తెలపగా వెంటనే సమస్యని పరిష్కరిస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. తదుపరి గ్రామ పంచాయతీ సిబ్బందితో మాట్లాడి వీధులను పరిశుభ్రంగా ఉంచాలని, మొక్కలను సంరక్షించాలని, జీతాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. బోధకాలు వ్యాధితో బాధపడుతున్న వెంకులు, కరుణమ్మతో మాట్లాడి మండల ప్రాథమిక హాస్పిటల్ కి వెళ్ళి డాక్టర్ తో మాట్లాడి సరి అయిన చికిత్స, మందులు ఇప్పించాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జగదీశ్ రెడ్డి, డీల్పీఓ కె.నారాయణ రెడ్డి, ఎంపీడీఓ సంతోష్ కుమార్, మండల వ్యవసాయ అధికారి ఆశ కుమారి, పంచాయతీ కార్యదర్శి కిషన్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed