ప్రజా సమస్యలు వెలికితీయడంలో దిశ ముందుంటుంది..

by Naveena |
ప్రజా సమస్యలు వెలికితీయడంలో దిశ ముందుంటుంది..
X

దిశ, హుజూర్ నగర్: ప్రజా సమస్యలను గుర్తించి వెలికి తీయడంలో దిశపత్రిక ముందుంటుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ అన్నారు. దిశ పత్రిక 2025 నూతన క్యాలెండర్ ను కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి హుజూర్ నగర్ ఆర్డీఓ బి శ్రీనివాసులు సీఐ చరమందరాజు తో కలిసి పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా వద్ద గల జెపిఎస్ ఫంక్షన్ హాల్లో క్యాలెండర్ ను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీడియా రంగంలో దిశ ప్రత్యేక స్థానం సంపాదించుకుందని కొనియాడారు. అతి తక్కువ కాలంలోనే వాస్తవాలను వెలికి తీసి ప్రజలకు దగ్గర అయిందని అన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాహశీల్దార్ కమలాకర్, డిపిఆర్ఓ రమేష్ ,ఎస్సై లక్ష్మీ నరసయ్య ,దిశ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి రావుల రాజు యాదవ్, మాజీ ఎంపీపీ గోపాల్ ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎన్. వి . సుబ్బారావు, మాలోత్ మోతిలాల్ నాయక్, బెల్లంకొండ నరసింహారావు, డెక్కన్ సిమెంట్ పరిశ్రమ సీజీఎం నాగమల్లేశ్వరరావు, పిడమర్తి ప్రేమ్ కుమార్ పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed