‘దిశ ఎఫెక్ట్’..స్పందించిన విద్యుత్ అధికారులు

by Aamani |
‘దిశ ఎఫెక్ట్’..స్పందించిన విద్యుత్ అధికారులు
X

దిశ,కనగల్లు: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం పొంచి ఉన్న ప్రమాదం.. ప్రమాదం జరిగితే గాని పట్టించుకోరా అని దిశ పత్రికలో గురువారం వచ్చిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. మండలంలోని ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద కరెంటు తీగలు చేతికి అందే ఎత్తులో వేలాడుతూ ఉన్నాయి. కరెంటు తీగలను రైతులు కర్రల సాయంతో పైకి ఎత్తి ఉంచడంతో విద్యుత్ అధికారులు రెండు విద్యుత్ స్తంభాలు వేసి కరెంటు తీగలు కిందికి వేలాడకుండా మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ కుమార్ మాట్లాడుతూ గ్రామంలోని ఎక్కడైనా విద్యుత్ తీగలు వేలాడుతూ కనబడితే వెంటనే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. తమ గ్రామంలో విద్యుత్ స్తంభాల సమస్యను పరిష్కరించినందుకు రైతులు దిశ పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story