- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLA Balu Naik : వ్యవసాయం అంటే దండగ కాదు - వ్యవసాయం అంటే పండుగ..
దిశ, డిండి : మండలంలో వీరబోయినపల్లి గ్రామ సమీపంలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ టన్నుల (డీఎల్ఐ) భూమి పూజ కార్యక్రమంలో బుధవారం దేవరకొండ, అచ్చంపేట, కల్వకుర్తి ఎమ్మెల్యేలు నేనావత్ బాలునాయక్, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డిలు పాల్గొన్నారు. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ ప్రాజెక్టు మత్స్య కార్మికులకు, రైతులకు ఉపయోగపడుతుందని, 9 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లవెల్లి రాజేష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మాధవరం దేవేందర్ రావు, నల్గొండ పార్లమెంట్ కో ఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, పీఎసీఎస్ చైర్మన్ జ్వాల నరసింహా రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొర్ర రామ్ సింగ్ నాయక్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, మాజీ సర్పంచ్ లు లక్పతి నాయక్, చింతలపూడి ఇందిరా భాస్కర్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.