బుద్ధవనంలో ధమ్మదీక్ష దినోత్సవం

by Naveena |
బుద్ధవనంలో ధమ్మదీక్ష దినోత్సవం
X

దిశ,నాగార్జునసాగర్ : బుద్ధవనంలో ధమ్మవిజయం వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ, మేనేజింగ్‌ డైరెక్టర్‌, బుద్ధవనం ప్రత్యేకాధికారి ఓ ప్రకటనతో తెలిపారు. బుద్ధుని ధమ్మంపట్ల ఆకర్షితుడైన సామ్రాట్‌ అశోకుడు..ఇకపై దిగ్విజయం స్థానంలో ధమ్మ విజయం చేకూరేలా తాను కృషి చేస్తానని, శాసనాలతో ప్రకటించిన సందర్భానికి గుర్తుగా..అక్టోబర్‌ 14వ తేదీ నిర్వహిస్తున్నారు. ఉదయం 10.00 గం॥లకు బుద్ధవనం మందిరంలో చేయనున్నారు. సికింద్రాబాద్‌ మహేంద్రాహిల్స్‌లోని మహాబోధిబుద్ధవిహార్‌, మైసూరు`బైలకుప్పెలోని సెరా బౌద్ధవిహారం నుంచి వచ్చే బౌద్ధాచార్యుల సమక్షంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌, పటేల్‌ రమేష్‌రెడ్డిల ఆధ్వర్యంలో.. జరిగే ఈ కార్యక్రమానికి నాగార్జునసాగర్‌ శాసన సభ్యులు, కుందూరు జయవీర్‌రెడ్డి అధ్యక్షత వహిస్తారని ఆయన చెప్పారు.మోక్షానంద బుద్ధవిహార (మోర్తాడ్‌), అధ్యక్షులు, పూజ్య ధమ్మరభిత ‘ధమ్మ విజయం దినోత్సవంపైన లతారాజా ఫౌండేషన్‌ సలహాదారు, పిఎస్‌ఎన్‌ మూర్తి ‘ధమ్మదీక్ష దినోత్సవంపై ప్రసంగిస్తారని ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ వేడుకకు అందరూ ఆహ్వానితులేనని కార్యక్రమం, మధ్యాహ్నం 1.00 గం॥కు ముగుస్తుందన్నారు.

Advertisement

Next Story