PM Modi: యుద్ధ క్షేత్రంలో పరిష్కారాలుండవు

by Mahesh Kanagandla |   ( Updated:2024-10-11 16:50:13.0  )
PM Modi: యుద్ధ క్షేత్రంలో పరిష్కారాలుండవు
X

దిశ, నేషనల్: రెండు రోజుల తన లావోస్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఈస్ట్ ఆసియా సదస్సులో మాట్లాడారు. ప్రపంచంలోని పలుదేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు గ్లోబల్ సౌత్‌ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయని వివరించారు. ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదని, రణస్థలి నుంచి సమస్యలకు పరిష్కారాలు దొరకవని స్పష్టం చేశారు. దౌత్యం, చర్చల ద్వారానే విభేదాలను పరిష్కరించుకోవాలన్నారు.

‘ప్రపంచంలోని పలుచోట్ల జరుగుతున్న ఘర్షణలు గ్లోబల్ సౌత్ దేశాలపై ప్రతికూల ప్రభావాన్ని వేస్తున్నాయి. యూరేషియా అయినా వెస్ట్ ఏషియా అయినా వీలైనంత త్వరగా శాంతి, సుస్థిరతలు నెలకొనాలనే అనుకుంటాయి. బుద్ధుడు నడయాడిన నేల నుంచి వచ్చిన నేను, ఇది యుద్ధాల శకం కాదని తరుచూ చెబుతాను. యుద్ధక్షేత్రం సమస్యలను పరిష్కరించదు. భౌగోళిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాల్సిన అవసరమున్నది. మానవీయ కోణంలో అడుగులు వేయడం, దౌత్యం, చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలి. విశ్వ బంధు ఆలోచనను ఆచరించడానికి భారత్ అన్ని విధాల కృషి చేస్తుంది’ అని ప్రధాని మోదీ తెలిపారు. వియత్నాంలో నిర్వహించిన ఈ సదస్సులో మాట్లాడిన ప్రధాని మోదీ.. అక్కడే అమెరికా రక్షణ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తోనూ భేటీ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed