- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CPI dharna : గ్రామకంఠం భూమి కాపాడాలి..
దిశ, చిలుకూరు : గత కొన్నేళ్లుగా మండలంలోని జెర్రిపోతుల గూడెం లో 29 గుంటల గ్రామకంఠం భూమిని కాపాడాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న విషయం విదితమే. ఈ విషయమై 'దిశ' ఇటీవల 'కలెక్టర్ సారు.. జర చూడండి' అంటూ కథనం కూడా ప్రచురించింది. ఈ భూమిని ఆక్రమించరాదంటూ అధికారులు గతంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం, దానిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం, తిరిగి సాగు చేసేందుకు ప్రయత్నించడంతో స్థానికులు మళ్లీ ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు మంగళవారం మళ్లీ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అధికారుల ఆదేశాలు బేఖాతర్ చేసి ఆ బోర్డును ధ్వంసం చేసి గ్రామకంఠం భూమిలో బుధవారం మళ్లీ ట్రాక్టర్ తో దున్నించారు. దీంతో సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ఉదయం జీపీ కార్యాలయం ఎదుట టెంట్ వేసి ఆ భూమిని కాపాడాలంటూ ధర్నా నిర్వహించారు.
ధర్నాలో పాల్గొన్న సీపీఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధికారులు గ్రామకంఠం భూమిని కాపాడేంత వరకూ తమ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు మాట్లాడుతూ కోదాడలో ఆర్డీవో సమక్షంలో ఇరు వర్గాలతో సమీక్షించి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. గ్రామంలో పలువురు పోరంబోకు భూములను ఆక్రమించారని, వాటిని కూడా ప్రభుత్వ పరం చేయాలని స్థానికులు కొందరు డిమాండ్ చేశారు. ధర్నాలో వ్యకాసం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రెమిడాల రాజు, సీపీఐ గ్రామ కమిటీ కార్యదర్శి కాంపాటి వెంకటయ్య, రామిశెట్టి కోటయ్య, మాజీ సర్పంచ్ రెమిడాల జయసుధ, రణబోతు అంజిరెడ్డి, వజ్రపు లక్ష్మయ్య, మాతంగి సైదులు, రామిశెట్టి రామనర్సయ్య, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.