- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pulichintala : పులిచింతలకు కొనసాగుతున్న నీటి ప్రవాహం..
దిశ, చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టుకు భారీగా నీటి ప్రవాహం కొనసాగుతుంది. నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో పులిచింతల ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం కొనసాగుతుంది. కాగా ఇంకా నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో ప్రాజెక్టు అధికారులు 3 రేడియల్ గేట్లు 2 మీటర్లు, ఒక గేటు 2.5 మీటర్లు ఎత్తి క్రిందకు నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు వరకు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 6.7254 టీఎంసీలుగా ఉంది.
పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులకు గాను ఇప్పటి వరకు నీటిమట్టం 130.411 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 30,388 క్యూసెక్కు లు కాగా, ప్రాజెక్టు రేడియల్ గేట్ల ద్వారా 26,083 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని, అలాగే పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తతో ఉండాలని చింతలపాలెం ఎస్సై సైదిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.