బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్

by Naresh |   ( Updated:2023-11-29 16:01:54.0  )
బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్
X

దిశ, తుంగతుర్తి: తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ మొగుళ్ళ జితేందర్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి బీఆర్‌ఎస్ పార్టీలో బుధవారం చేరారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాయకులు గణేష్, మేడబోయిన యకన్న, పాక కుమార్, యాకూబ్ పాష, శివరాత్రి సురేష్, బండారి నవీన్ తో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైనట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed