- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం
దిశ, మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఉందంటే ప్రజా ప్రభుత్వం పాలిస్తున్నట్టుగా ప్రజలు గుర్తించుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం దామరచర్ల మండల కేంద్రంలో ప్రజా సమస్యలపై ఏర్పాటుచేసిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో మీరు ఎలా పనిచేసారు అనేది మాకు అవసరం లేదని..ఇది ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా పాలనలో అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తూ.. వాటిని పరిష్కరించాలని సూచించారు. నేటి నుంచి వారంలో ఒకరోజు ఏదో ఒక గ్రామ పంచాయితీ లో అకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ప్రజలకు అందుబాటులో లేని పంచాయతీ కార్యదర్శిలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు సేకరించి ఆయా సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, స్కైలాబ్ నాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.