సీఎం కేసీఆర్ సభను అడ్డగిస్తాం: కాంగ్రెస్

by Disha News Desk |
సీఎం కేసీఆర్ సభను అడ్డగిస్తాం: కాంగ్రెస్
X

దిశ, భువనగిరి రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ నెల 12 న ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన సభను అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం రోజు భువనగిరిలో వైయెస్ఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి, మున్సిపాలిటీకి నిధులు ఇస్తామని చెప్పి ఇప్పటికి మంజూరు చేయలేదని ఆరోపించారు. పిల్లాయిపల్లి, భూనాదిగాని కాల్వ పనులు పూర్తి చేస్తామని చేయలేదన్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఎన్నో దొంగ హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చ లేదన్నారు. అందుకు గాను 12 న జరిగే కేసీఆర్ పర్యటన అడ్డుకుంటామని తెలియజేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిధులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి కేసీఆర్ నీ అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Next Story