- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమాలకు అడ్డాగా చిట్యాల.. అధికారుల కనుసన్నల్లోనే..?
చిట్యాల పట్టణం అనేక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఈ పట్టణం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి-65 పై ఉంది. దీంతో నగరం నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరం ఉండడంతో కొంతమందికి అసాంఘిక కార్యక్రమాలకు నెరపడానికి వేదికగా మారింది. ఇటీవల జాతీయ రహదారి వెంట హోటల్స్‌తోపాటు అనేక రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. దీంతో హైదరాబాద్‌వాసులు వీకెండ్, రేవ్ పార్టీలంటూ ఆధునిక కల్చర్‌కు అలవాటు పడి చిట్యాల వంటి పట్టణాలకు వచ్చి అక్రమాలకు తెర లేపుతున్నారు.
చిట్యాల పరిసర ప్రాంతాలలో భూములు కొని వాటిలో పేరుకు మాత్రమే తోటలు ఏర్పాటు చేసి సేద్యం చేస్తున్నారు. ఇక కొంతమంది ఫామ్ హౌజ్‌లు నిర్మించుకుని అనేక రకాల తతంగాలను నడుపుతున్నారు. కొంతమంది నిర్వాహకులు వీకెండ్, రేవ్ పార్టీలంటూ హైదరాబాద్ యువతను ఆకర్షించి వారితో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుండటం గమనార్హం. జూదం ఆడడంతో పాటు గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయం కూడా జోరుగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. చిట్యాల పోలీసులు గతంలో గంజాయి, పేకాట ఆడుతున్న వారిపై రైడ్ నిర్వహించి కేసులు నమోదు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి.
దిశ, చిట్యాల : చిట్యాల పట్టణం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి-65 పై ఉండడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. హైదరాబాద్ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరం ఉన్న చిట్యాల నేడు అక్రమాలకు వేదికగా మారింది. జాతీయ రహదారి వెంట హోటల్స్‌తోపాటు అనేక రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. హైదరాబాద్‌వాసులు వీకెండ్ పార్టీ, రేవ్ పార్టీలంటూ ఆధునిక కల్చర్‌కు అలవాటు పడి చిట్యాల వంటి పట్టణాలకు వచ్చి అక్రమాలకు తెర లేపుతున్నారు.
చిట్యాల పరిసర ప్రాంతాల్లో భూములు కొని వాటిలో పేరుకు మాత్రమే తోటలు ఏర్పాటు చేసి సేద్యం చేస్తున్నారు. ఇక కొంతమంది ఫామ్ హౌజ్‌లు నిర్మించుకుని అనేక రకాల తతంగాలను నడుపుతున్నారు. కొంతమంది నిర్వాహకులు వీకెండ్, రేవ్ పార్టీలంటూ హైదరాబాద్ యువతను ఆకర్షించి వారితో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. జూదం ఆడడంతోపాటు గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయం కూడా జోరుగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. చిట్యాల పోలీసులు గతంలో గంజాయి పై రైడ్ నిర్వహించి కేసులు నమోదు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి.
ఫామ్ హౌజుల్లో పార్టీలు...
అసలు ఫామ్ హౌజుల్లో నిత్యం వచ్చి పోయే వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులమని, లేదంటే బంధువులమని చెప్తూ ఫామ్ హౌజుల్లోకి రావడం రాత్రంతా ఎంజాయ్ చేసి వెళ్లిపోవడం తంతుగా మారింది. కొన్ని ఫామ్ హౌజుల్లో వీఐపీలతో వ్యభిచారం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫామ్ హౌజుల్లో నిత్యం ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ పోలీసుల నిఘా లేకపోవడంతో కొంతమంది నిర్వాహకులు పెట్రేగిపోతున్నారు. రాజకీయ పలుకుబడి, అధికారుల అండదండలు చూసుకుని ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
అధికారుల కనుసన్నల్లోనే..?
చిట్యాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫామ్ హౌజ్‌లు, జాతీయ రహదారి వెంట ఉన్న హోటల్స్‌లలో నిత్యం ఇటువంటి జూదం, గంజాయి విక్రయం, సేవించడం వంటి కార్యకలాపాల నిర్వహణ పోలీసుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయని అనుమానం వ్యక్తం అవుతోంది. రాజకీయ పలుకుబడి ఉన్న నేతలు కొంతమంది పోలీసులను మేనేజ్ చేస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
కంచె చేను మేసిన చందంగా...
ఈ నెల 17న పోలీసులు జూదరులను పట్టుకున్న ఘటనలో పోలీసులు విలేకరుల సమావేశంలో చెప్పిన అంశాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో ఐదు రోజుల కిందటే జూదరులను అరెస్టు చేసినప్పటికీ పోలీసులు మాత్రం 17న అరెస్టు చేసినట్లు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుండా జూదరులను చిట్యాల పట్టణంలోని జాతీయ రహదారి వెంట ఉన్న ఒక హోటల్లో పోలీసులు అరెస్టు చేయబడ్డారు.
రాజకీయ పలుకుబడి కలిగిన ఓ వ్యక్తి జోక్యం చేసుకొని ఈ ఘటన హోటల్లో జరగలేదని, వ్యవసాయ బావి తోటలో జరిగినట్లుగా చెప్పమని పోలీసులకు తగిన నజరానా ఇవ్వడంతో సీన్ మొత్తం హోటల్ నుంచి వ్యవసాయ తోటలోకి మారిందనీ విశ్వసనీయ సమాచారం. అయితే వాహనాలు కూడా సక్రమంగా వెళ్లలేని పరిస్థితి ఉన్న తోటలో పోలీసులు మూడు కార్లను పట్టుకున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా హోటల్లో జరిగిన అరెస్టు తోటలోకి మారిన వైనంపై జోరుగా చర్చ నడుస్తోంది. అయితే ఈ ఘటనలో సుమారు రూ.20లక్షలు నగదు పట్టుబడినప్పటికీ అందులో భారీగా నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. అయితే కేవలం రూ.3,13,000 మాత్రమే పట్టుబడినట్లు పోలీసులు చెప్పడం వెనక ఆంతర్యం ఏమిటనేది పోలీసులకే తెలియాలి. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తీసుకొని నిలువరించాల్సిన అధికారులే అమ్యామ్యాలతో వదిలేస్తున్నారు.
దీంతో ఇక్కడ జరిగే అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చిట్యాల పరిసర ప్రాంతాల్లోని తోటల్లోని పామ్ హౌజులు, రహదారి వెంట ఉన్న హోటళ్లపై నిఘా కట్టుదిట్టం చేస్తే ఇటువంటి ఘటనలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పోలీసులు స్పందించి అక్రమాలకు పాల్పడే వారిపై కఠన చర్యలు తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు