Old school : పొంచి ఉన్న ప్రమాదం..

by Sumithra |
Old school : పొంచి ఉన్న ప్రమాదం..
X

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాల భవనం అధ్వాన స్థితికి చేరి పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలోని దూరజ్ పల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఇరుకు గదుల్లో పడరాని పాట్లు పడుతున్నారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి పై కప్పు నుంచి వర్షపు నీరు కారుతుండడంతో కూర్చోవడానికి సైతం పిల్లలకు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాల భవనం పెచ్చులు ఊడి పిల్లల పై పడి ప్రమాదం జరగక ముందే అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed