బొల్లం మల్లయ్య యాదవ్‌కి రెండోసారి పార్టీ టికెట్

by Naresh |   ( Updated:2023-08-21 12:42:59.0  )
బొల్లం మల్లయ్య యాదవ్‌కి రెండోసారి పార్టీ టికెట్
X

దిశ, కోదాడ: అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థి జాబితాలో రెండోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్‌‌కు టికెట్ కేటాయించారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు పార్టీ శ్రేణులు, నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ ప్రెస్ మీట్ నడుస్తుండగానే బాణాసంచా కాల్చుతూ డీజే స్టెప్పుల మధ్య కార్యకర్తలు, నాయకులు నృత్యాలు చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. కోదాడలో గెలిచేది బొల్లం మల్లయ్య యాదవ్ అని నినాదాలు చేశారు.

Read More : BRS LIST: కులాలవారీగా బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ఇదే.

Advertisement

Next Story

Most Viewed