- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP leaders : వరి నాట్లు వేసి బీజేపీ నాయకుల నిరసన...
దిశ, చండూరు : చండూరు మున్సిపాలిటీలో ఆగిన రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బీజేపీ చండూరు పట్టణ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం కస్తాల చౌరస్తాలో రోడ్డు పై నిలిచిన వర్షపు నీటిలో వరినారు నాట్లు వేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల కావస్తున్నా రోడ్డు పనులు పూర్తి చేయకపోవడం చూస్తుంటే ప్రజా సమస్యల పై పరిష్కారం పట్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేవలం సమీక్షల పేరుతో కాలం వెల్లదీస్తున్నారు తప్ప పనులు పూరి చేయటంలో చిత్త శుద్ధి కనబరచటం లేదన్నారు.
గతంలో కూడా బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని ఆర్డీఓకు, ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చామని అయినప్పటికీ పనులు పూర్తి చేయకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సోమ నరసింహ, రాష్ట్ర అధికార ప్రతినిధి కోమటి వీరేశం, భూతరాజు శ్రీహరి, అన్నపర్తి యాదగిరి , రావిరాల శ్రీనివాసులు, చిలుకూరి అశోక్, తిరందాసు దామోదర్, ఇరిగి ఆంజనేయులు, సోమ శంకర్, తడకమల్ల శ్రీధర్, చనగాని శేఖర్, తిరందాసు శ్రీను, పేర్ల గణేష్, దోటి శివ, భూతరాజు స్వామి, కటికం నరేష్, గండు శ్రీకాంత్, భూతరాజు వేణు, చిట్టిప్రోలు వెంకటేశం, గండూరి మల్లేష్ , భూతరాజు రామకృష్ణ, కోమటి ఓంకారం తదితరులు పాల్గొన్నారు.