'రాష్ట్ర అభివృద్ధి తక్కువ.. కేసీఆర్ చేసిన అప్పులు ఎక్కువ'

by S Gopi |
రాష్ట్ర అభివృద్ధి తక్కువ.. కేసీఆర్ చేసిన అప్పులు ఎక్కువ
X

దిశ, చౌటుప్పల్: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి తక్కువ చేసి అప్పులు ఎక్కువ చేశాడని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని మూడవ శక్తి కేంద్రంలో బీజేపీ భరోసా స్వీట్ కార్నర్ మీటింగ్ కి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా గంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నదని, కరోనా సమయంలో ఉచిత వ్యాక్సిన్ ను పంపిణీ చేసి ప్రజలు కరోనా బారిన పడకుండా కాపాడింది కేంద్ర ప్రభుత్వం అని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం రావాలని ఆయన అన్నారు.


ప్రతి ఒక్క కార్యకర్త పట్టుదలతో బీజేపీ అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే గ్రామపంచాయతీలో అభివృద్ధి కొనసాగుతున్నదని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్, పట్టణ అధ్యక్షుడు వెంకటేశం, శక్తి కేంద్ర ఇన్చార్జి కాసుల వెంకటేశం, దాసోజు బిక్షమాచారి, ఎల్లంకి పాండు, సురేష్, రాజయ్య, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story