- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Bihar State Labourers : తెలంగాణకు బీహార్ రాష్ట్ర కూలీలు
దిశ,తుంగతుర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వివిధ రకాల పనుల నిర్వహణకు బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు ఇప్పుడిప్పుడే తెలంగాణకు చేరుకుంటున్నారు.ఈ మేరకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు 50 మందికి పైగానే చేరుకుని పనుల్లో నిమగ్నమయ్యారు.ఆయా గ్రామాలలో స్థానికంగా ఉన్న కూలీలు-కేంద్రాల నిర్వహకుల మధ్య వివిధ పనుల విషయంపై కూలి రేట్లు,పనుల వేగవంతం లాంటి వాటిపై ఏకాభిప్రాయం కుదరక గొడవలు జరుగుతున్నాయి. దీంతో కేంద్రాల నిర్వహకులు బీహార్ కూలీలను రప్పించుకుంటున్నారు.కేంద్రాలలో రైతు ధాన్యం పోసిన తర్వాత దాన్ని ఆరబెట్టడం,మిషన్ ద్వారా శుభ్రం చేయడం,కాంటాలు వేయడం,బస్తాలను లారీల్లోకి ఎత్తడం లాంటి పనులన్నీ బీహార్ కూలీలతోనే జరుగుతున్నాయి.ముఖ్యంగా స్థానికంగా ఉండే వారి కంటే బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన కూలీల ద్వారానే పనులన్నీ వేగవంతంగా జరుగుతాయని రైతులతో పాటు నిర్వాహకులు పేర్కొంటున్నారు.ప్రతి ఏటా ఖరీఫ్,రబీ సీజన్లలోధాన్యం కొనుగోలు కేంద్రాలలో వివిధ రకాల పనుల నిర్వహణకు బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు ఇప్పుడిప్పుడే తెలంగాణకు చేరుకుంటున్నారు. వందల సంఖ్యలో వారంతా ఇక్కడికి వస్తుంటారు.కొనుగోలు కేంద్రాల వద్ద నివాసాలు ఏర్పాటు చేసుకొని రేయింబవళ్లు పనులు చేస్తుంటారు.కేంద్రాల్లో కొనుగోళ్ల తతంగ పనులన్నీ పూర్తయిన పిదపనే వీరంతా తమ స్వస్థలమైన బీహార్ రాష్ట్రానికి తిరుగు ముఖం పడతారు.అంటే దాదాపు రెండు మాసాలపైనే వీరంతా కేంద్రాల్లో ఉంటారు.చేసిన పనులకు వారానికి ఒక సారి,మరి కొంతమంది పనులన్నీ పూర్తయ్యాక మొత్తంగా కూలి తీసుకుంటారు.కాగా బీహార్ కూలీల రాకపట్ల రైతాంగం కూడా హర్షిస్తోంది.కేంద్రాలలో తమ పనులన్నీ త్వరితగతిన పూర్తి కానున్నట్లు వివరిస్తోంది.