రాసలీలలకు అడ్డాగా మారిన బీబీనగర్ ఎయిమ్స్

by M.Rajitha |   ( Updated:2024-10-19 16:18:18.0  )
రాసలీలలకు అడ్డాగా మారిన బీబీనగర్ ఎయిమ్స్
X

దిశ నల్లగొండ బ్యూరో : అఖిల భారత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బీబీనగర్ లో రాసలీలల బాగోతం బయట పడింది . అనేక అనారోగ్యాలకు వైద్యం అందించే అత్యంత అధునాతనమైన ఆస్పత్రి ఇది. సామాన్య పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ఆరోగ్యాలకు, తెలంగాణ వాసుల ఆశల దవఖానాలో సాయంత్రం దాటింది అంటే బాధ్యత కలిగిన అధికారులు, డాక్టర్లు ఎవరు ఉండరు. ఇన్ పేషేంట్ లకు వైద్య విద్యార్థులే దిక్కు. ఎంతో గొప్పగా చెప్పుకునే ఆసుపత్రిని పాలనాపరమైన అధికార యంత్రాంగం లేకనే సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలోనే రాత్రులు గడుస్తున్నాయనేది నగ్న సత్యం. పూర్తి వివరాల్లోకి వెళితే.. గత రాత్రి(మంగళవారం) భువనగిరి పట్టణానికి చెందిన ఒక మహిళ అనారోగ్యంతో ప్లేట్స్ లెట్స్ తగ్గడంతో హుటాహుటిన బీబీనగర్ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి చికిత్స కొరకు వెళ్లారు. చికిత్స పొందుతున్న క్రమంలో ఆమెకు సంబంధించిన బంధువులు బయట నిరీక్షిస్తుండగా హాలులో స్త్రీ పురుషుడు అర్ధనగ్న దుస్తులతో అలింగనం చేసుకుంటూ ముద్దులతో అసభ్యకరంగా చేష్టలు కార్యక్రమాలు చేస్తున్న సంఘటనలు పేషెంట్ బంధువులు కళ్ళారా చూశారు. అంతలో ఒక వ్యక్తి సెల్ ఫోన్ లో జరుగుతున్న అశ్లీలతను చిత్రీకరించారు. అది గ్రహించిన సెక్యూరిటీ వచ్చి ఎందుకు తీస్తున్నావని హెచ్చరిస్తూ బెదిరించారు. అంతటితో ఆగకుండా పేషెంట్ బంధువు ఇదేమిటి రక రకాల అనారోగ్య సమస్యల బాధలతో ఆసుపత్రికి వస్తుంటారు. ఇక్కడ బయటికి కనపడేటట్టుగా హాలులో జరిగే కార్యక్రమాల గురించి అడగగా.. 'మా దగ్గర డాక్టర్ విద్య పూర్తి చేసిన వారు అలానే ఉంటారని, ఇదంతా సహజమే' అని ఓ సెక్యూరిటీ పెర్కొనడంతో అంతా అవాక్కయ్యారు. సెక్యూరిటీ అంతటితో ఆగకుండా ఇంకొంతమంది డాక్టర్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులుతో వచ్చి మీ సెల్ఫోన్లో చిత్రీకరించినది డిలీట్ చేసి సారీ చెప్పండి అంటూ హెచ్చరించగా.. పేషెంట్స్ బంధువులు మేము ఎందుకు సారీ చెప్పాలి.. జరిగినదే కదా, మేము చిత్రీకరించాం అని ఎదురు తిరగడంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. తీరా పరిస్థితిని పరిశీలిస్తే ఎంతో మంది ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చే ఆసుపత్రిలో, ఉన్నత చికిత్స అందించే ఉత్తమమైన ఎయిమ్స్ లో రాష్ట్రానికే గర్వకారణంగా ఉన్న ఈ ఆసుపత్రిలో ఆలనా పాలన కరువైందనేది తెలుస్తుంది. సాయంత్రం ఐదు దాటితే సంబంధిత ఉన్నతమైనటువంటి బాధ్యత కలిగిన అధికారులు ఎవరూ ఉండరు. వైద్య విద్యార్థులు సెక్యూరిటీ తప్ప పరిపాలనాపరమైనటువంటి విభాగాలకు సంబంధించిన వారు ఎవరు రాత్రివేళ ఉండరనేది తెలుస్తుంది.

ఇన్ఫెషెంట్ వైద్య విద్యార్థులే దిక్కు...??

అన్ని రకాల చికిత్సలకి వైద్య విద్యార్థులే దిక్కు.. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఏం జరిగినా ఎటువంటి వాటికైనా వైద్య విద్యార్థులదే రాజ్యం. ఈ క్రమంలో జరిగే సంఘటనలు సహజం అని చెప్పడం బాధ్యత రహితం అంటున్నారు పేషెంట్లుకు సంబంధించిన బంధువులు. ఏది ఏమైనా బీబీనగర్ ఎయిమ్స్ లో రాసలీలలు బాగోతంపై ఓ సెక్యూరిటీ ప్రశ్నించగా... 'నాకేమీ తెలవదు సార్ నా డ్యూటీ అయిపోయింది. అక్కడ జరిగింది మాత్రం వాస్తవమే.. అది అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది..' అని నికార్స్ అయినా సమాధానం చెప్పాడంతో వివరణ తీసుకోవడానికి ఎవరైనా డాక్టర్ల నంబర్ సంబంధిత ఇవ్వమంటే రేపు రండి కల్పిస్తాను మాట్లాడుకుందురు అని సమాధానం చెప్పారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో పరిపాలనాపరమైన నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా తీరు అద్దం పడుతుంది.

Advertisement

Next Story

Most Viewed