Tecno Phantom V Fold2: టెక్నో నుంచి త్వరలో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..!

by Maddikunta Saikiran |
Tecno Phantom V Fold2: టెక్నో నుంచి త్వరలో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ టెక్నో(Techno) ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌(Foldable Smartphone)ను త్వరలో గ్లోబల్‌ మార్కెట్‌(Global Market)తో పాటు భారత్‌(India)లో కూడా విడుదల చేయనుంది. టెక్నో ఫాంటం వీ ఫోల్డ్‌2(Tecno Phantom V Fold2) పేరుతో ఈ కొత్త ఫోన్(New Phone)ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ధర రూ.92,000 నుంచి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మొబైల్ మొత్తం మూడు కలర్‌లో లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ను 128 జీబీ ర్యామ్‌, 512 జీబీ ర్యామ్‌ వేరియంట్‌తో తీసుకొస్తున్నారు. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్(Amazon) ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

టెక్నో ఫాంటం వీ ఫోల్డ్2 5జీ ఫోన్ ఫీచర్ల వివరాలు..

  • 6.42-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+LTPO అమోలెడ్ డిస్‌ప్లే
  • మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ప్లస్‌ చిప్‌సెట్‌తో ఈ మొబైల్ పనిచేయనుందని తెలుస్తోంది.
  • ఇక కెమెరా విషయానికొస్తే బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 50 మెగా పిక్సెల్ పోర్ట్రైట్ లెన్స్, 50-మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్‌ను కలిగి ఉంది.
  • సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఇవ్వనున్నారు.
  • 70W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్‌, 15వాట్ల వైర్ లెస్ చార్జింగ్ సపోర్టుతో 5750mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది.
Advertisement

Next Story

Most Viewed