- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిన్నారుల్లో మానసిక అనారోగ్యం.. ఈ సంకేతాలతో తెలుసుకోండి..
దిశ, ఫీచర్స్ : పిల్లలు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారని నమ్ముతారు పెద్దలు, తల్లిదండ్రులు. అందుకే వారి మానసిక స్థితిని గుర్తించడంలో ఫెయిల్ అవుతున్నారు. 12 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు తమ సమయాన్ని ఎక్కువగా ఆడుకోవడం, నిద్రించడం లేదా పాఠశాల హోంవర్క్ చేయడంలో బిజీగా ఉంటారు. కానీ థెరపీ సెషన్ లో డాక్టర్ మాత్రం మీ
బాల్యం గురించి అడుగుతారు. ఎందుకు ఇలా అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మీరు చిన్నతనంలో వివరించలేని గాయాలు ఇప్పటికీ మీ వెంటాడే అవకాశం ఉండొచ్చు. అప్పుడు కమ్యూనికేషన్ చేయలేని బాధలు మీ మనసులోనే ఉండిపోవచ్చు. మీరు మాట్లాడాలని అనుకున్నా అప్పుడు పదాలు అందక చెప్పకపోయి ఉండే ఛాన్స్ ఉండొచ్చు. ఆ బాధలు, గాయాలు, సేఫ్ స్పేస్ లేదనే ఆలోచనలు మీ వ్యక్తిత్వంలో వేళ్లూనుకుని మీలో కొన్ని ఫోబియాలను నింపే అవకాశం కూడా ఉందని అంటున్న నిపుణులు.. అందుకే పిల్లలకు థెరపీ అవసరమని సూచిస్తున్నారు.
యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంట్
నిజానికి పిల్లలకు ఇలాంటి మానసిక అనారోగ్య సమస్యలు అంటే అవి ఇంట్లోనే తయారవుతాయని అంటున్నారు నిపుణులు. చిన్నవయసులో వారు ఆలోచించే విధానాన్ని ఇంట్లోని వాతావరణం ప్రభావితం చేస్తుంది. అయితే భారతదేశంలో పెద్ద సమస్య ఏంటంటే తమ పిల్లలు మానసికంగా బాధపడుతున్నారని ఒప్పుకునే వ్యక్తులు చాలా తక్కువ. ఎందుకంటే తమ పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారని నమ్ముతారు. ముఖ్యంగా తమ బిడ్డకు మెంటల్ ఇల్నెస్ ఏంటనే ప్రశ్నతో ఈ పరిస్థితిని యాక్సెప్ట్ చేయరు. కానీ అలా చేస్తే మొదటికే ముప్పు వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
మూడేళ్లకే ఆందోళన
కానీ అధ్యయనాలు పిల్లల్లో ఇలాంటి సమస్యలు సాధారణమని చెప్తున్నాయి. మూడు లేదా నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు ఆందోళనను అనుభవించగలరని, అలాగే అనేక ఇతర భావోద్వేగాలను వ్యక్తం చేయగలరని మనస్తత్వశాస్త్రంలో ప్రయోగాల ద్వారా మళ్లీ మళ్లీ నిరూపించబడింది. వారు అలాంటి బాధాకరమైన సంఘటనను లేదా అంత చిన్న వయస్సులో వారి స్వంతంగా నిర్వహించలేని ఏదైనా భావోద్వేగాన్ని అనుభవించినప్పుడు.. అది వారి వ్యక్తిత్వాన్ని చాలా దూరం చేస్తుంది. ఇక పిల్లల్లో ఒంటరితనం కూడా ఉంటుంది. అసలు వారు ఎందుకు లోన్లీగా ఉండాలని అనుకుంటున్నారు? ఏం చేయాలని అనుకుంటున్నారు? అనే విషయాల గురించి ఓపెన్ గా మాట్లాడటం ముఖ్యం. ఒక్కరే ఉండాలనుకున్నా, ఇతరులతో మాట్లాడాలని అనుకున్నా.. వారికి నచ్చినట్లుగా చేయడం మంచిది.
ఇలా గుర్తించండి..
కాగా పిల్లలు తమ బాధలను వివరించుకునేందుకు లాంగ్వేజ్ ఉండదు. కానీ వారి బిహేవియర్ ను బట్టి కొడుకు లేదా బిడ్డ ఏదో బాధలో ఉన్నారని పేరెంట్స్ గుర్తించవచ్చు. ఉల్లాసంగా ఉండే పిల్లాడు అకస్మాత్తుగా నిశ్శబ్దంగా ఉండటం.. సరిగ్గా నిద్రపోకపోవడం, తిండి మానేయడం, స్నేహితులతో ఆడుకునే వ్యక్తి అసలు అటువైపే మొగ్గుచూపకపోవడం వంటి అంశాలు పిల్లలు మానసికంగా గాయపడ్డారని సూచిస్తుంది.
నిర్లక్ష్యం మూల కారణం
చాలా మంది భారతీయ తల్లిదండ్రులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోరు. పైగా వారి నిర్లక్ష్యం వల్ల కూడా బిడ్డ ఇలాంటి పరిస్థితి అనుభవించవచ్చు. ప్రస్తుతం పిల్లలకు ఫోన్ ఇచ్చి వర్క్ చేసుకుంటున్నారు. కానీ ఆ కంటెంట్ ఎలాంటిది వస్తుంది అనేది చూడట్లేదు. దీనివల్ల ఒక్కోసారి చిన్నారులు భయంకర చలన చిత్రాలు చూసి దడుసుకుంటున్నారు. దీనివల్ల పీడకలలు కూడా రావొచ్చు. కాబట్టి ఇలాంటి విషయాలను చెప్పుకునేందుకు మంచి కమ్యూనికేషన్ ముఖ్యం. కాగా వారి కోసం మీరు ఉన్నారనే భరోసా ఇస్తే సరిపోతుంది.