మూడు పురుషాంగాలతో వ్యక్తి.. ఆ విషయంలో అసలు ప్రాబ్లమ్ లేకుండానే..

by Sujitha Rachapalli |
మూడు పురుషాంగాలతో వ్యక్తి.. ఆ విషయంలో అసలు ప్రాబ్లమ్ లేకుండానే..
X

దిశ, ఫీచర్స్ :రీసెర్చ్ వర్క్ కోసం సైన్స్‌కు దేహదానం చేసిన వ్యక్తికి మూడు పురుషాంగాలు ఉండటం చూసి UK వైద్యులు ఆశ్చర్యపోయారు. అయితే అతని బాహ్య జననేంద్రియాలు పూర్తిగా సాధారణమైనవిగా కనిపిస్తున్నందున.. అలాంటి అరుదైన శరీర నిర్మాణ శాస్త్రం ఉందని తెలియకుండానే తన జీవితమంతా గడిపాడు. మూడు పురుషాంగాలు చాలా అరుదైన పరిస్థితి కాగా దీనిని ట్రిఫాలియా అంటారు. మానవులలో మొదటి కేసు నాలుగు సంవత్సరాల క్రితం ఇరాక్‌కు చెందిన మూడు నెలల బాలుడిలో నమోదైంది. ఈ ఆవిష్కరణ జర్నల్ ఆఫ్ మెడికల్ కేస్ రిపోర్ట్స్‌లో ప్రచురించబడింది. ఇది మానవులలో నమోదు చేయబడిన ట్రిఫాలియా రెండవ కేసు కాగా పెద్దవారిలో మొదటిది.

మరణించిన వ్యక్తికి 78 సంవత్సరాలు. తెల్లగా, ఆరు అడుగుల పొడవుతో ఉన్న ఆయన.. పూర్తిగా సాధారణ పురుషాంగం కలిగి ఉన్నాడు. పరిశోధకులు అతని మృతదేహాన్ని విడదీసినప్పుడు.. అంతర్గతంగా మరో రెండు విభిన్న పురుషాంగాలను కనుగొని ఆశ్చర్యపోయారు. అవయవాలను మరింతగా పరిశీలించగా.. మూత్రనాళం అతని ప్రాథమిక, ద్వితీయ పురుషాంగం రెండింటిలోనూ ప్రవహించిందని కనుగొన్నారు. రెండవ పురుషాంగం చిన్నది కానీ కార్పస్ కావెర్నోసమ్, కార్పస్ స్పాంజియోసమ్, గ్లాన్స్ అని పిలువబడే మూడు ప్రధాన కణజాలాలను కలిగి ఉంది. మూడవ పురుషాంగం రెండవదాని వెనుక ఉంది కానీ మూత్రనాళానికి అనుసంధానించబడలేదు. కార్పస్ స్పాంజియోసమ్ లేదు. అతని ప్రాథమిక పురుషాంగం మూడు అంగుళాల పొడవుతో ఉండగా.. మిగిలిన రెండు 1.5 అంగుళాల పొడవు ఉన్నాయని తెలిపారు వైద్యులు.

Advertisement

Next Story

Most Viewed