- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెమో డిసౌజాపై చీటింగ్ కేసు
దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, ఆయన భార్య, మరో ఐదుగురిపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ డ్యాన్స్ ట్రూప్‌నకు సంబంధించి రూ. 11.96 కోట్లు మోసం చేసినట్టు మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. 26 ఏళ్ల ఓ డ్యాన్స్ ఫిర్యాదు ఆధారంగా మీరా రోడ్డు పోలీసు స్టేషన్‌లో అక్టోబర్ 6వ తేదీన కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రెమో డిసౌజా, ఆయన భార్య లిజెల్లీ డిసౌజా, ఓం ప్రకాశ్ శంకర్ చౌహాన్, రోహిత్ జాదవ్, ఫ్రేమ్ ప్రొడక్షన్ కంపెనీ, వినోద్ రౌత్, ఒక పోలీసు అధికారి, రమేశ్ గుప్తాలపై ఫోర్జరీ, చీటింగ్, ఇతర ఆరోపణలతో కేసు నమోదైంది.
2018 నుంచి 2024 మధ్య కాలంలో ఓ డ్యాన్స్ ట్రూప్‌ను వీరు మోసం చేసినట్టు ఫిర్యాదు అందింది. ఓ టెలివిజన్ షోలో పర్ఫార్మెన్స్ ఇచ్చి గెలిస్తే.. ఆ ట్రూప్ తమదే అని మోసపూరితంగా చెప్పుకుని రూ. 11.96 కోట్ల ప్రైజ్ మనీని కాజేసినట్టు డ్యాన్సర్ ఆరోపించారు.