- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సులభంగా గెలుస్తామని చెప్పలేం.. కివీస్ పేసర్ కీలక వ్యాఖ్యలు
దిశ, స్పోర్ట్స్ : తొలి టెస్టులో న్యూజిలాండ్ ముందు భారత్ 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. మ్యాచ్‌లో ఆదివారం ఆఖరి రోజు. కివీస్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే, తొలి టెస్టులో సులభంగా గెలుస్తామని చెప్పలేమని ఆ జట్టు పేసర్ విలియమ్ ఒరౌర్కె తెలిపాడు. శనివారం ఆట ముగిసిన తర్వాత అతను మీడియాతో మాట్లాడుతూ.. విజయం కోసం న్యూజిలాండ్ కష్టపడాల్సిందేనని చెప్పాడు.
తాము ప్రపంచ స్థాయి జట్టుతో ఆడుతున్నామన్నాడు. అయితే, గెలుపుపై ఆత్మవిశ్వాసంతో ఉన్నామని, వర్షం పడకపోతే తాము లక్ష్యాన్ని ఛేదిస్తామని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ వికెట్ తీయడంపై స్పందిస్తూ.. క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లుగా గుర్తింపు పొందిన వారి వికెట్ తీయడం ప్రత్యేకమైనదేనని తెలిపాడు. అలాగే, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. తొలి టెస్టులో సత్తాచాటిన ఒరౌర్కె రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 7 వికెట్లు పడగొట్టాడు.
- Tags
- #ind vs nz