- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
30 విమానాలకు బాంబు బెదిరింపులు.. ఆరు రోజుల్లో 70 ఫ్లైట్‌లకు..
దిశ, నేషనల్ బ్యూరో: ఎయిర్‌లైన్లు బెదిరింపు కాల్స్‌తో చిర్రెత్తిపోతున్నాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి బెదిరింపులు వస్తాయో.. విమానాన్ని ఎటు వైపు అత్యవసరంగా మళ్లించాలో అనే టెన్షన్ ఉన్నది. గడిచిన 6 రోజుల్లో 70 విమానాలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. శనివారం ఒక్క రోజే 30 విమానాలకు బెదిరింపులు రావడం గమనార్హం. ఇందులో ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్, విస్తారా, స్పైస్ జెట్, స్టార్ ఎయిర్, అలయన్స్ ఎయిర్ వంటి ఎయిర్‌లైన్లు ఉన్నాయి. కొన్ని బెదిరింపులు ఫోన్ కాల్స్ రూపంలో రాగా.. చాలా వరకు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఐపీ అడ్రెస్‌ల ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేసిన పోలీసులకు ఈ ఐపీ అడ్రెస్‌లు లండన్, జర్మనీ, కెనడా, యూఎస్‌లలో ఉన్నట్టు చూపిస్తున్నాయి. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ను వినియోగించి వాస్తవ లొకేషన్‌ను కప్పిపుచ్చే అవకాశాన్నీ తోసిపుచ్చలేమని అధికారులు తెలిపారు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
ఈ బెదిరింపుల నేపథ్యంలోనే ఎయిర్‌లైన్ల సీఈవోలతో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) ఢిల్లీలో శనివారం సమావేశమైంది. రాజీవ్ గాంధీ భవన్‌లోని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఈ బెదిరింపులను ఎదుర్కోవడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను ఫాలో కావాలని సీఈవోలకు సూచించారు. ఇలా వచ్చిన బెదిరింపులను, వాటిని ఎదుర్కోవడానికి చేపట్టిన చర్యలనూ ఎప్పటికప్పుడు ప్రయాణికులు సహా భాగస్వాములందరికీ తెలియజేయాలని చెప్పారు. ఇలా బాంబు బెదిరింపులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి బీసీఏఎస్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)లు కొత్త మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
శనివారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (IX 196) విమానం 189 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి జైపుర్‌కు బయలుదేరగా.. బెదిరింపు మెయిల్ రావడంతో వెంటనే జైపుర్‌లో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్ ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఎటువంటి అనుమానస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు బెంగళూరు నుంచి ముంబయికి వెళ్లేందుకు టేకాఫ్‌కు సిద్ధమైన ఆకాశ ఎయిర్‌లైన్స్ (QP1366) విమానానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. తనిఖీల్లో ఆ బెదిరింపు కూడా బూటకమే అని తేలింది. ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్తున్న విస్తారా (UK17) విమానానికి బెదిరింపులు రాగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు.