ఎమ్మెల్యేకు కోపం తెప్పించిన వైద్యసిబ్బంది.. ఆ ఇద్దరిని సస్పెండ్ చేయాలని ఆదేశం

by Julakanti Pallavi |   ( Updated:2024-08-29 11:43:08.0  )
ఎమ్మెల్యేకు కోపం తెప్పించిన వైద్యసిబ్బంది.. ఆ ఇద్దరిని సస్పెండ్ చేయాలని ఆదేశం
X

దిశ, అర్వపల్లి(జాజిరెడ్డిగూడెం): ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. హైదరాబాద్ నుండి తిరుమలగిరికి వెళ్ళుతున్న ఎమ్మెల్యే మార్గమధ్యలో జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజిస్టరు ను తనిఖీ చేయగా ఇద్దరు ఉద్యోగులు సంతకం చేసి విధుల్లో లేని విషయాన్ని గుర్తించారు. వెంటనే డీఎంహెచ్ఓ డా.కోటాచలం కు ఫోన్ చేసి విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా మందుల సరఫరా, రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలను ఫార్మాసిస్ట్ మాధవిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్పిటల్లో ఉన్న రోగులతో మాట్లాడి, వైద్యసేవలు అందుతున్న తీరును, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed