- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చేపల చోరీకి పాల్పడిన వ్యక్తుల అరెస్ట్..
దిశ, చిట్యాల : చెరువులో నుండి చేపలను చోరీ చేస్తూ స్థానికులకు పట్టుబడి అరెస్టయిన ఉదంతం చిట్యాల మండలంలో శివనేనిగూడెంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం పెద్ద చెరువులో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు చెరువులో చేపలను అక్రమంగా వలలు వేసి పట్టుకుని చోరీకి పాల్పడుతుండగా స్థానికులు పసిగట్టి వారిని పట్టుకున్నారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు చోరికి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు నూతి సైదులు మాట్లాడుతూ చేపలు పట్టడాన్ని వృత్తిగా మలుచుకుని జీవనం కొనసాగిస్తున్న మత్స్యకారుల కుటుంబాలను దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారిపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.