అభ్యర్థులను ప్రకటించిన బీఎస్పీ.. ఉమ్మడి నల్లగొండ క్యాండిడేట్లు వీరే

by Satheesh |   ( Updated:2023-10-03 15:24:28.0  )
అభ్యర్థులను ప్రకటించిన బీఎస్పీ.. ఉమ్మడి నల్లగొండ క్యాండిడేట్లు వీరే
X

దిశ, నలగొండ బ్యూరో: రానున్న సాధారణ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ తరఫున ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం ప్రకటించారు. అందులో వట్టి జానయ్య యాదవ్ (సూర్యపేట), పిల్లుట్ల శ్రీనివాస్( కోదాడ), మేడి ప్రియదర్శిని (నకిరేకల్), మూడవత్ వెంకటేష్ చౌహన్ (దేవరకొండ) ఎంపిక చేశారు. గత ఎన్నికల కంటే మెరుగ్గానే ఈసారి జరిగే శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయని జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యావంతులు, మేధావులు, యువత పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని తెలుస్తోంది. బీఎస్పీ అభ్యర్థి విజయం సాధించకపోయినా గెలుపు ఓటములపై అత్యంత ప్రభావం చూపనట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story