కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటా : ఎమ్మెల్యే

by Naresh |   ( Updated:2023-10-11 10:27:42.0  )
కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటా : ఎమ్మెల్యే
X

దిశ, నూతనకల్: రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్​ లోని తన నివాసంలో నూతనకల్ మండల పరిధిలోని మిర్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ ఇరుగు నాగయ్య తో పాటు ఆగిరెడ్డి, సూరయ్య ,పరమేష్, నాగేష్, రఘు, మల్లేష్, పరశురాములు, హరికృష్ణ, సురేష్, నరేష్ , పలువూరు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మున్న మల్లయ్య, బూరెడ్డి సంజీవరెడ్డి, పీఏసిఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, యూత్ అధ్యక్షుడు బద్దం ప్రశాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story