హోలీ పండుగ రోజే బావిలో పడి వ్యక్తి మృతి

by samatah |
హోలీ పండుగ రోజే బావిలో పడి వ్యక్తి మృతి
X

దిశ, భూదాన్ పోచంపల్లి: హోలీ పండుగరోజు యువకుడు బావిలో పడి మృతిచెందిన ఘటన భూదాన్ పోచంపల్లి సీతవాని గూడెంలో చోటు చేసుకొంది.స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని సీతవాని గూడెం గ్రామానికి చెందిన యువకుడు ఒంటెద్దు స్వామి(25) తండ్రి నర్సింహ.మంగళ వారం హోలీ పండుగ కావడంతో స్నేహితులతో కలిసి హోలీ ఆడి స్నానం కోసమని గ్రామంలోని మేడి బావిలోకి ఈతకని వెళ్ళి బావిలో పడి మృతి చెందాడు.

తల్లి దండ్రులు తమ కొడుకు ఇంటికి ఎంతకీ రాకపోయే సరికి హోలీ రాత్రి నుంచే ఆచూకీ కోసం గాలించారు.బుధవారం సాయంత్రం మృతిని తల్లి పద్మ కొడుకు వేసుకున్న దుస్తులు,చెప్పులను బావి గట్టు వద్ద చూడటంతో బావిలో శవమై కనిపించగా విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్థానిక పోలిస్ స్టేషన్ కు సమాచారం అందించటంతో హుటాహుటిన పోలీస్ లు సంఘటన స్థలానికి చేరుకొని సిఐ మహేష్ ఎస్సై సైది రెడ్డి పర్యవేక్షణలో చౌటుప్పల్ ఫైర్ సిబ్బంది, గ్రామస్తుల సహాయంతో విద్యుత్ మోటార్లతో బుధ వారం రాత్రి నుంచి గురువారం తెల్లవారు జాము వరకు బావిలోంచి నీటిని పూర్తిగా తోడి శవాన్ని వెలికి తీశారు.మృతునికి ఇద్దరు మహిళా తోబుట్టువులు, తల్లి దండ్రులున్నారు. పోస్టు మార్టం నిమిత్తం శవాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైది రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story