- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈదురు గాలులకు కూలిన ఇల్లు..
by Sumithra |
X
దిశ, తుంగతుర్తి : భగభగ మండే ఎండలతో అతలాకుతలమైన తుంగతుర్తి మండల ప్రజానీకం పై శనివారం సాయంత్రం వరుణుడు కరుణించాడు. ఈ మేరకు వర్షంతో పాటు వీచిన బలమైన ఈదురుగాలులతో వాతావరణం చల్లబడింది. ముఖ్యంగా పలుప్రాంతాలలో వీచిన గాలులకు ఇండ్ల పై ఉన్న రేకుల కప్పులు లేచిపోయాయి. పశువుల కోసం దాచుకున్న గడ్డివాములు ఎగిరిపోయాయి.
కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కుంటపెళ్లి - మామిడాల ప్రధాన రహదారి పై పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డు పై పడిపోయాయి. ఇదిలా ఉంటే మండలంలోని కాశీతండ గ్రామ ఆవాస ప్రాంతం జొన్నలగడ్డ తండలో గుగులోతు విమలకు చెందిన ఇంటి పై చెట్టు కూలడంతో పూర్తిగా ధ్వంసమైంది. నిరాశ్రయులైన విమలకుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ఉపసర్పంచ్ భూక్య గోపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story