- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
36 గంటలు గడుస్తున్నా.. దొరకని యువకుల ఆచూకీ
దిశ, చింతలపాలెం: మండలంలోని అడ్లూరు గ్రామ శివారులో గల ఎత్తిపోతల పథకం వద్ద సోమవారం ఉదయం 6 గంటల సమయంలో కృష్ణానదిలో నిల్వ ఉన్న పులిచింతల బ్యాక్ వాటర్ లో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నదిలో పడి మునిగిపోయిన విషయం తెలిసిందే, నదిలో పడి 36 గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. స్థానిక ఎస్ఐ రంజిత్ రెడ్డి, తహశీల్దార్ సచిన్ చందర్ తివారి సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నత అధికారులకు తెలియజేస్తూ, గజ ఈతగాళ్లు, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఎస్సై, తహశీల్దార్ తెలిపారు. సంఘటనా స్థలం వద్ద ఇరువురి కుటుంబాల తల్లిదండ్రులు ఆర్తనాదాలు, ఏడుపులతో ప్రాంతం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. సంఘటనా స్థలానికి స్థానికులు గ్రామస్థులు పెద్ద ఎత్తున చేరుకొని మృతదేహాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
ప్రభుత్వ ఉన్నత అధికారికారులు వెంటనే స్పందించి నదిలో పడ్డ యువకులను బయటకు తీసుకురావడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, తక్షణమే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు చింతిరాల బాలచంద్రుడు,ఆరోన్, రామయ్య లు కోరారు. సంఘటనా స్థలంలో ఎంపీటీసీ చింత రెడ్డి సైదిరెడ్డి, కందుకూరి వెంకటేశ్వర్లు, ఆర్ ఐ సైదా, పోలీస్, రెవెన్యూ సిబ్బంది, ఉన్నారు.