అసదుద్దీన్ ఓవైసీతో నల్గొండ గద్దర్ భేటీ.. ఎంపీ ఎన్నికల వేళ ఆకస్మిక భేటీకి అసలు రీజన్ ఇదేనా?

by Prasad Jukanti |   ( Updated:2024-04-03 11:53:36.0  )
అసదుద్దీన్ ఓవైసీతో నల్గొండ గద్దర్ భేటీ.. ఎంపీ ఎన్నికల వేళ ఆకస్మిక భేటీకి అసలు రీజన్ ఇదేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఎంపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో ప్రముఖ సింగర్, నర్సన్న అలియాస్ నల్గొండ గద్దర్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం ఎంఐఎం పార్టీ ఆఫీస్ దారుస్సలాంలో ఓవైసీతో నర్సన్న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ఎంఐఎం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సన్న రేవంత్ రెడ్డిపై పాడిన 'మూడు రంగుల జెండా పట్టి..' పాట పొలిటికల్ సర్కిల్ లో పొలిటికల్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. అలాంటి నల్గొండ గద్దర్ తాజాగా ఎంఐఎం చీఫ్ తో ఆకస్మికంగా భేటీ కావడం వెనుక ఉద్దేశం ఏంటనేది చర్చగా మారింది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నర్సన్న ఏపీ సీఎం జగన్ తో పాటు పలువురు నేతలపై పొలిటికల్ సాంగ్స్ పాడుతున్నాడు. వీరి భేటీ వెనుక కూడా ఓవైసీపై ఏదైనా సాంగ్ కు ప్లాన్ చేస్తున్నారా? లేక భేటీ వెనుక మరేదైనా కారణ ఉందా అనేది ఉత్కంఠగా మారింది.

తెలుగు ఓటర్లకు దగ్గరయ్యే ప్లాన్?:

ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఆ పార్టీ తరపున ఈసారి కూడా అసదుద్దీన్ ఓవైసీనే పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈసారి అసద్ గతంలో కంటే కఠిన సవాల్ ఎదుర్కోబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా మాధవిలతను ప్రకటించగా ఎంఐఎం, బీజేపీలకు ధీటైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ వ్యూహం చేస్తోంది.ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ లు గట్టి పోటీని ఇస్తే ఇక్కడ కేవలం ముస్లిం ఓటర్లతోనే నెగ్గుకురావండం ఎంఐఎంకు కష్టతరమైన పని అని అందువల్ల ఇక్కడ ఉర్దు మాట్లాడే ఓటర్లతో పాటు తెలుగు మాట్లాడే వారిని ఆకట్టుకోవడంపై దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా అసదుద్దీన్ పై నల్గొండ గద్దర్ ఏదైనా పాట రూపంలో ప్రచారానికి ప్రయత్నాలు చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే నిజమైతే నల్గొండ గద్దర్ రేవంత్ రెడ్డి, జగన్ కోసం పాడిన పాటలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉండగా ఓవైసీ పాట ఎలా ఉంటుందో చూడాలి మరి.


Advertisement

Next Story