మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం సంచలన సవాల్

by Rajesh |
మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం సంచలన సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన సవాల్ విసిరారు. సీఎల్పీ మీడియా పాయింట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి మాట్లాడారు. 2014 ముందు జగదీష్ రెడ్డి ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత? అని ప్రశ్నించారు. జగదీష్ రెడ్డి ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రెండు రోజుల నుండి కేసీఆర్, జగదీష్ రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అన్నారు. మేమే తెలంగాణ తెచ్చామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని. పదేండ్లలో బీఆర్ఎస్ హయాంలో అనేక స్కామ్‌లు జరిగాయని గుర్తు చేశారు.

మాజీ విద్యుత్ శాఖ మంత్రి ఎలాంటి అక్రమాలు జరగలేదు జ్యుడీషియల్ విచారణ చేయమన్నాడని గుర్తు చేశారు. కేసీఆర్ డైరెక్షన్‌తోనే జగదీష్ రెడ్డి అసెంబ్లీ లో మాట్లాడారని.. ఇప్పుడు విచారణ చేపట్టొద్దని కేసీఆర్, జగదీష్ రెడ్డి అంటున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ చెప్పకుండానే జగదీష్ జ్యుడీషియల్ విచారణ చెయ్యమన్నారా అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలులో అవకతవకలు బయట బడతాయనే ఇప్పుడు జ్యుడీషియల్ విచారణకు హాజరు కావడం లేదన్నారు. ఈ చర్యలతో విద్యుత్ రంగాన్ని అంధకారంలో నెట్టే ప్రయత్నం చేశారని అర్థం అవుతుందన్నారు.పొరాడే తత్వం ఉన్న కేసీఆర్ ఎందుకు దొడ్డి దారి వెతుక్కుంటున్నాడో చెప్పాలన్నారు. వెయ్యి మెగా వాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసి వెయ్యి మెగావాట్ల ఎక్సెస్ తెచ్చారన్నారు.

ఇసుక దందాకే యాదాద్రి పవర్ ప్లాంట్ తెచ్చారని ఆరోపించారు. జగదీష్ రెడ్డికి అవినీతి అక్రమాల మీద ఉన్న శ్రద్ద అభివృద్ధి మీద లేదన్నారు. విద్యుత్ అక్రమాల మీద ఉన్న వాటా జగదీష్ రెడ్డి కి, కేసీఆర్‌కి ఎంత? అని ప్రశ్నించారు.మీరు నిజాయితీ పరులైతే కమిషన్ ముందు హాజరు కావాలని డిమాండ్ చేశారు. భువనగిరి ఎమ్మెల్యే కంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జగదీష్ రెడ్డి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు. పార్టీ పిరాయింపులకు తెరలేపింది కేసీఆరే కదా అని గుర్తు చేశారు. బీఆర్ఎస్‌ను ప్రజలు చీదరించుకున్నారు, పార్టీ ఉనికి కోల్పోయిందన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క సీటు గెలవలేదు డిపాజిట్ కూడా రాలేదని తెలిపారు. కేసీఆర్ దగ్గర చెంచా గిరి చేసి ఫిరాయింపులు చేసింది మీరే కదా అని సీరియస్ అయ్యారు. విద్యుత్ రంగంలో రూ.80వేల కోట్ల అప్పులు చేసిండ్రు కదా అన్నారు. విద్యుత్ అవకతవలపై కమిషన్ విచారణకు, అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కావడం లేదన్నారు. బీఆర్ఎస్‌కు తెలంగాణలో స్థానం లేదన్నారు.

చేరికలు ప్రోత్సహించిందే కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని ప్రశంసించారు.

Advertisement

Next Story

Most Viewed