- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌కు బిగ్ షాక్! నాగర్‌కర్నూల్ బీఎస్పీ ఎంపీ అభ్యర్థి ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మంద జగన్నాథం బీఎస్పీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడుకు శ్రీనాథ్‌కు అలంపూర్ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించగా ఇవ్వలేదు. దీంతో ఆయన గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన నాగర్‌కర్నూల్ టికెట్ ఆశించగా కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. దీంతో మంద జగన్నాథం బీఎస్పీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే బుధవారం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లా కేంద్రంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి సమక్షంలో తెలంగాణ స్టేట్ చీఫ్ మంద ప్రభాకర్ చేతులమీదుగా బీఎస్పీ పార్టీ జాయిన్ అయ్యారు. అంతేకాకుండా. లోక్ సభకు జరుగుతున్న ఎన్నికల్లో నాగర్ కర్నూల్ స్థానం నుంచి బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా మాయావతి ప్రకటించారు. ఈ సందర్భంగా మంద జగన్నాథ్‌కు బీఎస్పీ పార్టీ శుభాకాంక్షలు తెలిపింది. కాగా, మంద జగన్నాథం బీఎస్పీ పార్టీలో చేరడం, ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో నాగర్‌కర్నూల్ రాజకీయాలు అసక్తిగా మారాయి.