- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
N-Convention: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున భావోద్వేగ పోస్ట్
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తనకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై మరోసారి స్పందించారు. తాను కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటానని, అప్పటి వరకు ఎలాంటి పుకార్లు, అబద్దాలు నమ్మవద్దని నాగార్జున తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఎన్ కన్వెన్షన్ మీద వస్తున్న వార్తల్లో నిజాల కంటే అబద్దాలే ఎక్కువ ఉన్నాయని అన్నారు. ఎన్ కన్వెన్షన్ పూర్తిగా పట్టా భూమిలోనే నిర్మించాము. చెరువులో ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదు. ఆ భూమి డాక్యుమెంట్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎలాంటి కబ్జా జరగలేదని కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. కేసు ఇంకా కోర్టులో ఉండగానే మా నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చివేశారు. ఇది సరైనది కాదు. ఇక మీడియాలో అనేక పుకార్లు, అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. దయచేసి నా శ్రేయోభిలాషులు, అభిమానులు వాటిని నమ్మకండి. నాకు కోర్టుల మీద చాలా నమ్మకం ఉంది. న్యాయం నావైపే ఉన్నపుడు, తీర్పు కూడా నాకు అనుకూలంగానే వస్తుందని నాగార్జున అన్నారు.
- Tags
- N-Conventions